ఉదయ భాస్కర్, శ్రీరాములు చౌదరి సంస్మరణార్థం పేదలకు అన్నదానం

 

          ప్రముఖ కళాకారులు బొట్టా ఉదయభాస్కర్, మేడికొండ శ్రీరాములు చౌదరి సంస్మరణార్ధం నేడు హనుమంతరాయ గ్రంథాలయం వద్ద 100 మంది పేదలకు ఆహార ప్యాకెట్ల ద్వారా అన్నదానం జరిగింది. ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిన ఇస్కఫ్ జాతీయ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు కె సుబ్బరాజు మాట్లాడుతూ సుప్రసిద్ధ నటునిగా, దర్శకునిగా నాటకరంగంలో  బొట్టా ఉదయభాస్కర్ కళాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని, అత్యధిక సమయాన్ని కళారంగానికి కేటాయించేవారన్నారు. కళాకారునిగా, కళాభిమాని గా, ప్రగతిశీల రచయితగా, హనుమంతరాయ గ్రంథాలయ కార్యదర్శిగా మేడికొండ శ్రీరాములు చౌదరి బహుముఖ సేవలు అందించారని కే సుబ్బరాజు పేర్కొంటూ విజయవాడ కళారంగంలో వీరిరువురిది ప్రత్యేక శైలి అని కొనియాడారు.

         ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన గ్రంధాలయ సత్యం మాట్లాడుతూ వీరిరువురి తో తనకు గల ప్రత్యేక అనుబంధం రీత్యా తనకు తానే అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేస్తూ  ఉదయభాస్కర్, శ్రీరాములు చౌదరి సేవలు మరుపురానివని  అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శక్తి వరదుడు విశ్వకర్మ భగవానుడు

ఈ సంఘం స్థాపించడానికి గల కారణాలు: