పోస్ట్‌లు

ఏప్రిల్, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది
Mahatma jyothirao phule and his wife  Savitribai phule

శక్తి వరదుడు విశ్వకర్మ భగవానుడు

చిత్రం
శక్తి వరదుడు విశ్వకర్మ భగవానుడు - తమిరి పుల్లారావు 9640945832 కదలిక లేని సృష్టిని ఊహించలేము. చలనం జీవ సహజం. లోకాలన్నీ జాగృదావస్థలో ఉండాలంటే కదలిక ఉండాలి. ఆ కదలికను శ్రీ విశ్వకర్మ భగవాన్‌ కలిగిస్తారు. కదలికలో పని దాగి ఉంటుంది. ఆ దృష్టితో చూసినట్లయితే పనిలేని జీవి ఉండనే ఉండదు. అందుకనే జీవులకు చలన శక్తి కలింగించేదీ ఆ విశ్వకర్మ భగవానే. ప్రతి పనిలో ఆయనే ఉన్నారు. పని చేసే వారందరికీ శ్రీ విశ్వకర్మే ఆరాధ్య దైవం. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 17 వ తేదీన జరుపుకుంటున్నాము.  శ్రీ విశ్వకర్మ భగవాన్‌ను మన రాష్ట్రం,  మన దేశంలోనే కాదు- అన్ని రాష్ట్రాలలోనూ, ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఆరాధిస్తున్నారు. ఉత్సవాలు జరుపుకుంటున్నారు. జీవికకు చిహ్నమైన అన్ని రకాల పనులలోనూ నిమగ్నమవుతున్నారు. సద్యస్ఫూర్తి పొందుతున్నారు. ఎందుకంటే ఆయన మనకు పనిచేసే శక్తినిస్తున్నారు. శక్తి వరదుడు ఆయన.  ఈ చరాచర సృష్టికంతటికీ కర్త శ్రీ విశ్వకర్మ భగవాన్‌. ఆయన సంకల్పంచేతనే సకల సృష్టి నిర్మాణం జరిగిందని వేదోప నిషత్తులు, పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే శ్రీ విశ్వకర్మభగవాన్‌ ఈ భూగోళంపై నివసించే మానవులకు, సకల జీవకోటి