పోస్ట్‌లు

మార్చి, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆశాకిరణం

పల్లవి: ఈ ఉదయం అంబేడ్కరు  జన్మదినం ఈ ఉదయం అంబేడ్కరు జన్మదినం అది మహోద - పెను సంచలనం అణగారిన జనాలకు చైతన్య యుగం   //ఈ//  చరణం 1: తరతరాల దోపిడిపైన - తిరుగుబాటు ప్రభంజనం యుగయుగాల బలిదానంపై బ్రతుకుపోరు సమరం సామాజిక అసమానతపై చావుదెబ్బ ఈ రోజు కులం మతం మూఢత్వంపై పిడుగుపాటు ఈ రోజు  //అంబేడ్కర్// చరణం 2: దగాపడ్డ జీవులకోసం వెలుగొందిన ఆశాకిరణం పీడిత జన హక్కుల కోసం నినదించిన శంఖారావం అజ్ఞానపు చీకటిలోన జ్ఞానజ్యోతి ఈ సమయం భరత భూమి చరిత్రలోనే ప్రభవించిన నవయుగం  //అంబేడ్కర్//                                                                                                       రచన: రాగంపడి ఏప్రిల్ 14 డా|| బి.ఆర్. అంబే డ్కర్ జయంతి సందర్బంగా
చిత్రం