పోస్ట్‌లు

మే, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

విశ్వబ్రాహ్మణ చైతన్య సంఘం ఉద్దేశం ఇదీ...

ఈ సంఘం 15 ఏప్రిల్‌ 2015న ఏర్పాటయింది. దీనికి ప్రాంతీయ పరిమితి లేదు. విజయవాడ నగరం, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్‌, భారతదేశం, ప్రపంచ దేశాలు ఇలా ఎక్కడెక్కడ విశ్వబ్రాహ్మణులున్నారో అక్కడి వరకూ ఈ సంఘం చేతులు చాచి సహాయాలను అందిస్తుంది. ప్రస్తుతం విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి ఆశయాలకు అనుగుణంగా కులమతాలకు అతీతంగా అందరికీ సహాయ కార్యక్రమాలు విస్తరిస్తాం. ఆధునిక సమాజంలో విద్య ఎంతో విలువైనదైనందున చేతి వృత్తుల్లోనూ, వ్యాపారాల్లోనూ  ఉన్నప్పటికీ కనీస విద్య అభ్యసించాలని సంఘం కోరుతోంది. ప్రధానంగా విశ్వబ్రాహ్మణ బాలబాలికలకు చదువు చెప్పించడం లక్ష్యంగా పనిచేస్తుంది. సంఘం కార్యవర్గం అధ్యకక్షులు: డాక్టర్‌ కర్రి లక్ష్మీనారాయణ, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఉపాధ్యకక్షులు: పొన్నాడ ఈశ్వరాచారి, సిద్ధాంతి ప్రధాన కార్యదర్శి: బోనుమద్ది వరప్రసాద్‌ ధన్వంతరి, రిటైర్డ్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సహాయ కార్యదర్శి: తమిరి పుల్లారావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ కోశాధికారి: నడిపల్లి చంథ్రేఖర్‌, ప్రధానోపాధ్యాయులు కార్యవర్గ సభ్యులు: పుల్లేటికుర్తి కిరణ్‌కుమార్‌

ఈ సంఘం స్థాపించడానికి గల కారణాలు:

                                             ఈ సంఘం స్థాపించడానికి గల కారణాలు:  విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలు, విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులు అని పిలువబడే ఈ విశ్వబ్రాహ్మణ వంశీయులకు ఘన చరిత్ర ఉంది. పూర్వం వీరు దేవబ్రాహ్మణులు అని వ్యవహరింపబడుతూ సమాజంలో విశేష గౌరవ మర్యాదలు అందుకున్నారు. మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు గోత్ర రుషులు. వీరే పంచ రుషులు.  వీరి ద్వారా ఇనుప పని, ఇత్తడి పని, చెక్కపని, శిల్పాల పని, బంగారం పని అనే పంచవృత్తులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా విశ్వబ్రాహ్మణుల్ని  పంచదాయులు అని కూడా పిలిచేవారు. వీరు ఒకపక్క ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాన్ని పొందడమే కాక వృత్తుల పరంగా సామాజికంగానూ కీలకపాత్ర పోషించారు. అయితే కాలానుగుణంగా సామాజిక పరిస్థితులు మార్పు పొందుతున్న క్రమంలో వంశపారంపర్యంగా వస్తున్న వృత్తులకు ప్రాధాన్యం తగ్గడంతోనూ, ఆధునిక సాంకేతికత విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ వృత్తుల్లో ఇతరులు ప్రవేశిస్తున్న కారణంగానూ విశ్వబ్రాహ్మణులు తమతమ సంప్రదాయక వృత్తులకు స్వస్తి చెప్పడంతోపాటు ఇతర వృత్తుల్లోకి, ఉద్యోగాల్లోకి ప్రవేశించాల్సి వచ్చింది. పూర్వకాలంలో సమాజానికి మార్గదర్శకంగా ఉండడమేగాక సమ