పోస్ట్‌లు

ఏప్రిల్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు

విజయవాడ :  లాక్ డౌన్  అమలులో ఉన్న  మే 3 వరకు నిబంధనలు కచ్చితంగా పాటిద్దాం. అత్యవసరం అయితే తప్ప  ఇంటినుంచి  బయటకు  రాకుండా  ఉందాం.. మాస్క్  తప్పనిసరి చేద్దాం.  విజయవాడ లో  లాక్ డౌన్ అమలు బాగా ఉన్నా మరెన్నో చోట్ల ఉల్లంఘనలకు  గురవుతున్నది. కరోనా పాజిటివ్  కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మనందరం మరింత కఠినంగా నిబంధనలు పాటించాల్సి  ఉంది.  ఈ తరుణంలో  ఉల్లంఘన  విచారకరం.  పరిస్థితి తీవ్రతను అందరూ గమనించాలి.  విధుల్లో ఉన్న వైద్యులకు ప్రభుత్వం  సౌకర్యాలు మరింత   మెరుగు పరచాలి.  నిజానికి వైద్యులు ,  పోలీసులు , పారిశుద్ధ్య పనివారి సేవలు అభినందనీయం. ప్రాణాలకు తెగించి వారు చేస్తున్న త్యాగానికి  మంచి ఫలితాలు  లభించాలంటే  మనందరం వారికి సహకరించాలి.  ఏ లక్షణాలు లేకపోయినా  కరోనా పాజిటివ్  రావడానికి గల  కారణాలు  ఏమిటో కనిపెట్టాలి.  ఏమాత్రం అనుమానం  ఉన్నా వారందరికీ   పరీక్షలు  నిర్వహించాలి.    నిర్వాసితులకు ఆశ్రయం కల్పించి  ఆహార పానీయాలు సమకూరుస్తున్న  ప్రభుత్వాన్ని  అభినందించాలి. అలాగే  అందరికి రేషన్ అందిస్తున్నందుకు కూడా.... పేదలకు, మధ్య తరగతి వారికి   ,కూరగాయలు వగైరాలు  అందజేస్తున్న సేవా సంస్థ