పోస్ట్‌లు
2019లోని పోస్ట్‌లను చూపుతోంది
ఆశాకిరణం
- లింక్‌ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
పల్లవి: ఈ ఉదయం అంబేడ్కరు జన్మదినం ఈ ఉదయం అంబేడ్కరు జన్మదినం అది మహోద - పెను సంచలనం అణగారిన జనాలకు చైతన్య యుగం //ఈ// చరణం 1: తరతరాల దోపిడిపైన - తిరుగుబాటు ప్రభంజనం యుగయుగాల బలిదానంపై బ్రతుకుపోరు సమరం సామాజిక అసమానతపై చావుదెబ్బ ఈ రోజు కులం మతం మూఢత్వంపై పిడుగుపాటు ఈ రోజు //అంబేడ్కర్// చరణం 2: దగాపడ్డ జీవులకోసం వెలుగొందిన ఆశాకిరణం పీడిత జన హక్కుల కోసం నినదించిన శంఖారావం అజ్ఞానపు చీకటిలోన జ్ఞానజ్యోతి ఈ సమయం భరత భూమి చరిత్రలోనే ప్రభవించిన నవయుగం //అంబేడ్కర్// రచన: రాగంపడి ఏప్రిల్ 14 డా|| బి.ఆర్. అంబే డ్కర్ జయంతి సందర్బంగా