విశ్వబ్రాహ్మణ చైతన్య సంఘం ఉద్దేశం ఇదీ...
ఈ సంఘం 15 ఏప్రిల్ 2015న ఏర్పాటయింది.
దీనికి ప్రాంతీయ పరిమితి లేదు. విజయవాడ నగరం, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచ దేశాలు ఇలా ఎక్కడెక్కడ విశ్వబ్రాహ్మణులున్నారో అక్కడి వరకూ ఈ సంఘం చేతులు చాచి సహాయాలను అందిస్తుంది. ప్రస్తుతం విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి ఆశయాలకు అనుగుణంగా కులమతాలకు అతీతంగా అందరికీ సహాయ కార్యక్రమాలు విస్తరిస్తాం.
ఆధునిక సమాజంలో విద్య ఎంతో విలువైనదైనందున చేతి వృత్తుల్లోనూ, వ్యాపారాల్లోనూ ఉన్నప్పటికీ కనీస విద్య అభ్యసించాలని సంఘం కోరుతోంది. ప్రధానంగా విశ్వబ్రాహ్మణ బాలబాలికలకు చదువు చెప్పించడం లక్ష్యంగా పనిచేస్తుంది.
సంఘం కార్యవర్గం
అధ్యకక్షులు: డాక్టర్ కర్రి లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ప్రొఫెసర్
ఉపాధ్యకక్షులు: పొన్నాడ ఈశ్వరాచారి, సిద్ధాంతి
ప్రధాన కార్యదర్శి: బోనుమద్ది వరప్రసాద్ ధన్వంతరి, రిటైర్డ్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్
సహాయ కార్యదర్శి: తమిరి పుల్లారావు, సీనియర్ జర్నలిస్ట్
కోశాధికారి: నడిపల్లి చంథ్రేఖర్, ప్రధానోపాధ్యాయులు
కార్యవర్గ సభ్యులు:
పుల్లేటికుర్తి కిరణ్‌కుమార్, పుస్తక విక్రేత
చలపాక ప్రకాశ్, రమ్యభారతి సంపాదకులు
పెంటపాటి సత్యనారాయణ, సీనియర్ ఆర్టిస్ట్
ఉప్పనాపల్లి షణ్ముఖరావు, ప్రొఫెసర్
గమనిక: కార్యవర్గ సభ్యులుగా మరికొంత మంది చేరాల్సి ఉంది. త్వరలో వారు సంఘంలో చేరతారు.
సభ్యత్వాలే సంఘ పరిపుష్టికి హేతువు కనుక సంఘంలో సభ్యులుగా చేరాల్సిందిగా కోరుతున్నాం. సంఘం చేపట్టే అనేక కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా నిలవమని విన్నవించుకుంటున్నాం. సాధారణ సభ్యులలో అర్హులైనవారు సంఘం అందించే సహాయాలను అందిపుచ్చుకోవలసిందిగా కోరుతున్నాం. పూర్తి వివరాలకు సంఘ అధ్యక్ష ప్రధానకార్యదర్శులను సంప్రదించండి.
విశ్వబ్రాహ్మణుల సర్వతోముఖాభివృద్ధికి సంఘం బృహత్తర ప్రణాళిక రూపొందించింది. దీనికి దాతల విరాళాలే ఆయువుపట్టు. విశ్వబ్రాహ్మణ యువకుల్లో ఏ ఒక్కరు కూడా చదువు రాని వాడిగానో, నిరుద్యోగి గానో, ఉపాధి లేని వాడిగానో ఉండకూడదనేది సంఘం ఆశ. ఇందుకు ఆయా యువకులకు చదువు, ఉద్యోగం, ఉపాధి కల్పించేందుకు సంఘం సహాయ సహకారాలు అందిస్తుంది. ఇంకా అనేకానేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కనుక దాతలు సహృదయంతో భూరి విరాళాలు అందించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి