ఈ సంఘం స్థాపించడానికి గల కారణాలు:
ఈ సంఘం స్థాపించడానికి గల కారణాలు:
విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలు, విశ్వకర్మ విశ్వబ్రాహ్మణులు అని పిలువబడే ఈ విశ్వబ్రాహ్మణ వంశీయులకు ఘన చరిత్ర ఉంది. పూర్వం వీరు దేవబ్రాహ్మణులు అని వ్యవహరింపబడుతూ సమాజంలో విశేష గౌరవ మర్యాదలు అందుకున్నారు. మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు గోత్ర రుషులు. వీరే పంచ రుషులు. వీరి ద్వారా ఇనుప పని, ఇత్తడి పని, చెక్కపని, శిల్పాల పని, బంగారం పని అనే పంచవృత్తులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా విశ్వబ్రాహ్మణుల్ని పంచదాయులు అని కూడా పిలిచేవారు. వీరు ఒకపక్క ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాన్ని పొందడమే కాక వృత్తుల పరంగా సామాజికంగానూ కీలకపాత్ర పోషించారు. అయితే కాలానుగుణంగా సామాజిక పరిస్థితులు మార్పు పొందుతున్న క్రమంలో వంశపారంపర్యంగా వస్తున్న వృత్తులకు ప్రాధాన్యం తగ్గడంతోనూ, ఆధునిక సాంకేతికత విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ వృత్తుల్లో ఇతరులు ప్రవేశిస్తున్న కారణంగానూ విశ్వబ్రాహ్మణులు తమతమ సంప్రదాయక వృత్తులకు స్వస్తి చెప్పడంతోపాటు ఇతర వృత్తుల్లోకి, ఉద్యోగాల్లోకి ప్రవేశించాల్సి వచ్చింది. పూర్వకాలంలో సమాజానికి మార్గదర్శకంగా ఉండడమేగాక సమాజాన్ని శాసించగలిగే విశ్వబ్రాహ్మణులు నేడు గౌరవమర్యాదలు సన్నగిల్లడం, ఆర్థికంగా వెనుకబడిపోవడం వంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. విద్యకు దూరమయ్యారు. ఇతర వృత్తుల్లో ప్రవేశించలేని వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో సంప్రదాయ వృత్తుల్లోనే కొనసాగుతూ తీవ్రపోటీని ఎదుర్కొంటూ జీవితాలు భారంగా గడుపుతున్నారు. ఆర్థిక బలహీనతల కారణంగా ధార్మిక జీవితాన్ని ఒదులుకొని అనగా సంధ్యావందనాది నియమాలకు, ప్రత్యేక అనుష్ఠానాలకు దూరమై సామాన్య జీవనం సాగిస్తున్నారు. ఆధ్యాత్మిక జీవనపథంలో ఒకప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న విశ్వబ్రాహ్మణ జాతి ఈ రోజు కడు సామాన్య స్థితికి చేరుకుంది. ప్రభుత్వం విశ్వబ్రాహ్మణుల్ని వెనుకబడిన తరగతుల్లోకి చేర్చినా, ఆర్థిక పరమైన పథకాలు అమలు చేస్తున్నా విశ్వబ్రాహ్మణుల జీవితాలను మెరుగుపరచలేకపోతున్నది. వారి ఆధ్యాత్మిక, ధార్మికపరమైన ఉన్నత స్థానాన్ని వారికి మళ్లీ దక్కేలా చేయలేకపోతున్నది. విశ్వబ్రాహ్మణ సంఘాలు, వృత్తి సంఘాలు వాటి వాటి పరిథుల్లో విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి సాగిస్తున్నా పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించలేకపోతున్నాయి. రాజకీయంగా, సాంఘికంగా కొంతమేరకు మాత్రమే అవి సేవలందించగలుగుతున్నాయి. ప్రత్యేకించి విశ్వబ్రాహ్మణ సంస్క ృతిని పరిరక్షించుకోవడంలో ఆయా సంఘాలు దృష్టి పెట్టలేకపోతున్నాయి.
ఈ నేపథ్యంలో విశ్వబ్రాహ్మణ సంస్కృతిని కాపాడుకుంటూ పూర్వపు సామాజిక హోదాను, ఆర్థిక పరిపుష్టిని మళ్లీ సంపాదించుకోవడానికి, అనంతమైన విశ్వబ్రాహ్మణ వాంగ్మయాన్ని పరిరక్షించుకోవడానికి, విశ్వకర్మ, వీరబ్రహ్మేంద్రస్వామి వంటి మహనీయుల ప్రవచనాలను నలుమూలలా పరివ్యాప్తం చేసేందుకు, అదే సమయంలో సామాజిక సేవాకార్యక్రమాలు, నేటి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసేందుకు ఒక బలమైన వేదిక కావలసి ఉన్నది. విశ్వబ్రాహ్మణులలో జ్ఞానవయోవృద్ధులు, కార్యనిర్వహణ దక్షులు, సామాజిక సేవాపరాయణులు కలసికట్టుగా, భావ సమన్వయంతో ఈ వేదికను నిర్మించాల్సి ఉంది. ఈ ఆవశ్యకతను గుర్తించిన విశ్వబ్రాహ్మణ ప్రముఖులతో విశ్వబ్రాహ్మణ చైతన్య సేవా సంఘం పేరుతో వేదికను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. విద్య లక్ష్యం ఉద్యోగమే కాదు` అది మన జీవితాలను వెలుగు దారులవెంట నడిపిస్తుందని విశ్వసిస్తూ ఈ సంఘం ప్రథమ ప్రధాన్యతా అంశంగా విద్యావ్యాప్తికి కృషి చేస్తుంది.
ఎవరికోసం? : ఈ సంఘం పంచవృత్తులైన కమ్మరం, కంచరం, వడ్రంగం, శిల్పం, స్వర్ణ వృత్తుల్లోనూ, ఇతర ఉపాధి, ఉద్యోగాది వ్యాపకాల్లో ఉన్న విశ్వబ్రాహ్మణుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుంది. ప్రస్తుత రాష్ట్ర, జిల్లా, మండల విశ్వబ్రాహ్మణ సంఘాల వారితో స్నేహపురస్సరంగా `సలహాసంప్రదింపులతో ముందుకు సాగుతుంది. విద్యకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది.
లక్ష్యాలు: (1) విశ్వబ్రాహ్మణులలో రాజకీయాలకు అతీతంగా` ఆధ్యాత్మికపరంగా, సామాజిక పరంగా చైతన్యం తీసుకురావడం, ఇందుకుగాను ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని ఆహ్వానించి నెలవారీ సమావేశాలు నిర్వహించడం
(2) సామాజికంగా విశ్వబ్రాహ్మణుల పూర్వవైభవ సాధనకు దోహదపడడం
(3) విశ్వబ్రాహ్మణులలో యువకులకు ప్రభుత్వ పథకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషిచేయడం
(4) విశ్వబ్రాహ్మణ సంస్కృతినీ చరిత్రనూ నలుదిశలా వ్యాపింపజేయడం, దీనిలో భాగంగా విశ్వబ్రాహ్మణులలో పూర్వ, ప్రస్తుత మేధావులు, రచయితలు, కవుల రచనలు ప్రచురించడం
(5) ప్రతి మాస / త్రై మాస సమావేశాలు ఏర్పాటుచేసి విశ్వబ్రాహ్మణుల స్థితిగతులపై సమీక్షలు జరపడం
(6) వెనుకబడిన తరగతులకు చెందిన మన విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వ పథకాలు అందేలా సహకారం అందించడం
తత్‌క్షణ లక్ష్యాలు: (1) సామూహిక అక్షరాభ్యాసాలు చేయించడం
(2) ఏడేళ్ల లోపు విశ్వబ్రాహ్మణ బాలలకు సామూహిక ఉపనయనాలు నిర్వహించడం
(3) విద్యావ్యాప్తి` విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వడం, ఫీజులు చెల్లించడం, చదువుకోవాలనే తపన ఉన్న విద్యార్థులను కేజీ నుంచి పీజీ వరకు చదివించడం, ఆసక్తి, అవకాశం ఉన్న వయోజనులకు కూడా విద్యను అందించే ఏర్పాట్లు చేయడం
(4) తెలుగు (మాతృ) భాషాభివృద్ధికి కృషిచేయడం, విద్యార్థులకు బాల్యం నుంచి తెలుగు అభ్యసనానికి ప్రోత్సాహమివ్వడం, అలాగే ఆంగ్ల భాషకు కూడా సముచిత స్థానమిచ్చి ప్రోత్సహించడం, ఆధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యమిస్తూ ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఆర్థిక, హార్థిక సహాయాన్ని అందించడం, అలాగే ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులకు అధ్యయనంలో అవసరమైన సహాయం అందించడం
(5) నిరుపేద విశ్వబ్రాహ్మణ వధువులకు వివాహాలు చేయించడం
(6) నిరాశ్రయులైన వృద్ధులకు, మహిళలకు తగిన ఆశ్రయం కల్పించేందుకు, ఉపాధి చూపేందుకు మార్గదర్శకత్వం వహించడం
(7) విశ్వబ్రాహ్మణులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఉద్యోగ రీత్యా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడం, అలాగే సంఫీుయులలో ఆధ్యాత్మిక పరంగాగానీ, సంస్క ృతి పరంగాగానీ ఏమైనా సమస్యలు ఉత్ప న్నమైతే వాటిని ధర్మవేత్తల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయడం
(8) సంస్థ ఆర్థిక పుష్టిని, అవకాశాలను అనుసరించి విశ్వబ్రాహ్మణులకు అవసరమైన ఇతర కార్యక్రమాలను నిర్వహించడం
బృహత్కార్యాచరణ: సంస్థ సొంత కార్యాలయం నిమిత్తం భవన నిర్మాణం, లేదా కొనుగోలు కోసం ఈ సంస్థ ఆవిర్భావ సమయం నుంచి లక్ష్యం సాధించే వరకు కృషి చేయడం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి