ఆశాకిరణం

పల్లవి:

ఈ ఉదయం అంబేడ్కరు  జన్మదినం
ఈ ఉదయం అంబేడ్కరు జన్మదినం
అది మహోద - పెను సంచలనం
అణగారిన జనాలకు చైతన్య యుగం   //ఈ//
 చరణం 1:
తరతరాల దోపిడిపైన - తిరుగుబాటు ప్రభంజనం
యుగయుగాల బలిదానంపై బ్రతుకుపోరు సమరం
సామాజిక అసమానతపై చావుదెబ్బ ఈ రోజు
కులం మతం మూఢత్వంపై పిడుగుపాటు ఈ రోజు  //అంబేడ్కర్//
చరణం 2:
దగాపడ్డ జీవులకోసం వెలుగొందిన ఆశాకిరణం
పీడిత జన హక్కుల కోసం నినదించిన శంఖారావం
అజ్ఞానపు చీకటిలోన జ్ఞానజ్యోతి ఈ సమయం
భరత భూమి చరిత్రలోనే ప్రభవించిన నవయుగం  //అంబేడ్కర్//

                                                                                                      రచన: రాగంపడి

ఏప్రిల్ 14 డా|| బి.ఆర్. అంబే డ్కర్ జయంతి సందర్బంగా

కామెంట్‌లు